నాగాలాండ్ లారీకి దేశంలోనే అత్యధిక జరిమానా విధించిన అధికారులు

  • ఒడిశాలోని సందల్ పూర్ లో వాహనాల తనిఖీలు
  • నాగాలాండ్ లారీని ఆపిన ఆర్టీవో అధికారులు
  • పత్రాలు సరిగాలేవంటూ రూ.6.53 లక్షల జరిమానా
రహదారిపై ప్రయాణించే సమయంలో వాహనాలకు పత్రాలు లేకపోవడం వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ విధించే జరిమానాలు మహా అయితే వేలల్లోనే ఉంటాయి. కానీ నాగాలాండ్ కు చెందిన ఓ లారీకి దిమ్మదిరిగిపోయే రీతిలో ఫైన్ వేశారు. పత్రాలు సరిగాలేవంటూ నాగాలండ్ లారీకి రూ.6,53,100 జరిమానా వడ్డించారు. ఒడిశాలోని సందల్ పూర్ లో తనిఖీల సందర్భంగా ఆర్టీవో అధికారులు ఈ రికార్డు జరిమానా విధించారు. ఇప్పటివరకు దేశంలో విధించిన జరిమానాలన్నింటిలోకి ఇదే అత్యధికమని చెప్పాలి. ఇంత జరిమానా చూసి లారీ యజమానికి కళ్లు బైర్లు కమ్మి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Go Back to Shorts
Nagaland
Odisha
Fine
RTO

More Telugu News